![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -372 లో.. అందరు భోజనం చెయ్యడానికి వచ్చి భవాని కోసం చూస్తుంటారు. అప్పుడే ముకుంద వచ్చి.. నేను వడ్డిస్తాను కూర్చోండని రేవతితో అంటుంది. అలా అనగానే ఏం అవసరం లేదంటూ చిరాకుగా అనేసరికి.. ప్లీజ్ అర్థం చేసుకోండి అత్తయ్య.. భవాని అత్తయ్యకు ఎదరుగా ఉంటే అసలు ఇక్కడ నుండి వెళ్లిపోతుందని ముకుంద అనగానే.. సరే అని రేవతి కూర్చుంటుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి వచ్చి మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్తారు. అప్పుడే భవాని కూడా వస్తుంది. ఆదర్శ్ ఆచూకి దొరికిందని అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒక ముకుంద మాత్రం డల్ అయిపోతుంది. నువ్వు కూర్చొ ముకుంద నేను వడ్డిస్తానని కృష్ణ అంటుంది. మధు నువ్వు నా పక్కన వచ్చి కూర్చో అని భవాని కోపంగా అనగానే.. ముకుంద బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆదర్శ్ ఆచూకి దొరికింది అంటే చాల హ్యాపీగా ఉంది కానీ వాడు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో అని భయంగా ఉందని భవాని అనగానే.. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య.. అంత నా బాధ్యత అని చెప్పాను కదా అని కృష్ణ అంటుంది. ఇప్పుడు మేం వెళ్తున్నాం. వచ్చేటప్పుడు ఆదర్శ్ ని తీసుకొని వస్తామంటు కృష్ణ, మురారి ఇద్దరు బయల్దేరి వెళ్తారు. ఆ తర్వాత కృష్ణ మురారి కలిసి వెళ్ళి మెహత గారిని కలుస్తారు. ఆదర్శ్ జాబ్ రీసైన్ చేసి అక్కడ దగ్గర ఊర్లో ఉన్నాడని చెప్తాడు. ఆ తర్వాత వెంటనే కృష్ణ మురారి కలిసి ఆదర్శ్ ఉన్న దగ్గరికి బయల్దేరి వెళ్తారు.
మరొకవైపు ఆదర్శ్ వస్తే నా పరిస్థితి ఏంటని ముకుంద టెన్షన్ పడుతుంది. ఆదర్శ్ ని భర్త గా ఆక్సెప్ట్ చేస్తానని మురారికి మాట ఇచ్చాను. నా ప్రేమని చంపుకోవాలా అని తనలో తనే బాధపడుతుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి కలిసి కారులో కబుర్లు చెప్పుకుంటు వెళ్తారు. మధ్య మధ్యలో టీ భోజనాలు కానిస్తూ వెళ్తుంటారు. తరువాయి భాగంలో కృష్ణ, మురారి ఇద్దరు ఆదర్శ్ దగ్గరికి వెళ్తారు. ఆదర్శ్ మాత్రం రూపం మారిన మురారిని గుర్తు పట్టడు. దాంతో కృష్ణ జరిగిందంతా చెప్పి మురారి ఇతనే అని చెప్పడంతో మురారిని ఆదర్శ్ హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |